Chiranjeevi: యూకే పార్లమెంటులో లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్న మెగాస్టార్.! 11 month ago

featured-image

టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను దాటారు. చిరంజీవి పేరు మీదున్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న మెగాస్టార్..తాజాగా మార్చి 19న (బుధవారం) లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్.. యూకే పార్లమెంటులో ఆయన జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందుకున్నారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా చిరంజీవిని సన్మానించారు. బ్రిటీష్ ప్రభుత్వం అందించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న తొలి భారతీయ సెలబ్రిటీగా చిరుకు గొప్ప గౌరవం దక్కింది. 


సినిమాల ద్వారా కళారంగంతో పాటు సమాజానికి చిరు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ కూడా చిరు చేసిన కృషిని గుర్తించి.. కల్చరల్ లీడర్‌షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ను అందజేసింది.


చిరంజీవి తమ్ముడు..నటుడు-రాజకీయ నాయకుడైన పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా చిరుకు ఈ పురస్కారం లభించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసారు. చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి రక్తదానం, నేత్రదానం వంటి సేవలు అందించారని కొనియాడారు.


చిరు తన సినీ కెరీర్‌ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మంచి.. మంచి రికార్డులు కూడా సృష్టించారు. అయితే ఇటీవల విడుదలైన ‘భోళాశంకర్’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ‘విశ్వంభర’ చిత్రంపై పడింది. ఈ సోషియో-ఫాంటసీ చిత్రం హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతోంది. త్రిష, ఆషికా రంగనాథ్ వంటి నటీమణులు ఇందులో నటిస్తున్నారు. 


చిరు తన జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నప్పటికీ.. ఈ యూకే పార్లమెంటు పురస్కారం ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD